
వేసవిలో కార్లను ఎండ నుంచి రక్షించుకోవాలి. ఈ క్యాంప్‌లో మీ కారు సర్వీసులను ఈ సర్వీసు క్యాంపులో ఉచితంగా చేస్తారు. ఇందులో పర్ఫామెన్స్, సేఫ్టీ, ఏసీ వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. దీని వల్ల మీ కారు వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ కాలం నడుస్తుంది.
లేబర్ ఛార్జీలు, స్పేర్ పార్టులపై డిస్కౌంట్
ఈ సర్వీస్ క్యాంప్‌లో మీకు లేబర్ ఛార్జీలపై తగ్గింపు, జెన్యూన్ పార్ట్లు, కార్ యాక్సెసరీలపై ఆఫర్లు లభిస్తాయి. అంతేకాకుండా, ఏసీ సర్వీస్, బ్యాటరీ చెకప్, బ్రేక్ వంటి విలువ-జోడించిన సర్వీస్‌లపై కూడా ఎట్రాక్టివ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఎక్సటెండెడ్ వారంటీ పై ఎక్స్ ట్రా బెనిఫిట్స్
తమ కారు వారంటీని పొడిగించుకోవాలనుకునే వినియోగదారులకు ఎక్కువ సేఫ్టీ కవరేజ్‌తో పాటు ప్రత్యేక రివార్డ్‌లు , బోనస్ బెనిఫిట్స్ కూడా అందించనున్నారు.
ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ మర్చండైజ్
కంపెనీ ఈ క్యాంప్‌లో ప్రత్యేక బ్రాండెడ్ మర్చండైజ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో క్యాప్స్, టీ-షర్ట్లు, కీచైన్లు, ఇతర యాక్సెసరీలు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఫ్యాక్టరీ-ట్రెయిన్డ్ టెక్నీషియన్ల సర్వీసు
మీ కారు సర్వీసింగ్‌ను కంపెనీ ద్వారా శిక్షణ పొందిన నిపుణులైన టెక్నీషియన్లు నిర్వహిస్తారు. దీని వల్ల ప్రతి పని ప్రొఫెషనల్‌గా, ఖచ్చితత్వంతో జరుగుతుందని చెప్పొచ్చు.
ఈ సమ్మర్ క్యాంప్ బెనిఫిట్స్ ఏమిటి?
వేసవి కాలం కార్లకు బ్యాడ్ టైం అనే చెప్పాలి. ఏసీ ఎక్కువగా ఉపయోగించడం నుంచి లాంగ్ డ్రైవ్‌ల వరకు కారు పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. ఈ సర్వీస్ క్యాంప్‌లో మీరు ఎక్కువ ఖర్చు లేకుండా మీ కారును పూర్తిగా సమ్మర్-రెడీగా చేసుకోవచ్చు. సిట్రోయెన్, జీప్ ఈ సమ్మర్ సర్వీస్ క్యాంప్ వేసవిలో కారు సంరక్షణ కోసం ఒక అద్భుతమైన అవకాశం. ఉచిత చెకప్ చేయించుకోవడమే కాకుండా, డిస్కౌంట్లు, వారంటీ ప్రయోజనాలు, మర్చండైజ్‌ను కూడా పొందవచ్చు.