పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటమే దానికి కారణంగా చెబుతున్నారు. మరొక 20 రోజుల పాటు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తన డేట్స్ ని కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ను కేటాయిస్తాడో అప్పుడు ఈ సినిమా పూర్తి అయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇక ఈ సినిమా లేట్ అవుతుందని సుజీత్ మధ్యలో నానితో ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఆ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. ఇక ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నానితో సుజిత్ చేస్తున్న సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
మరి పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే సుజిత్ కి భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. మరి ఆ హైప్ ను ఇప్పుడు వాడుకుంటూ ఆయన ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం స్టార్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాడు. లేకపోతే మాత్రం ఆయన తన మార్కెట్ ను భారీగా కోల్పోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు…
