
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 444 రోజుల పాటు డిపాజిట్ చేసుకున్న వారికి 20 బేసిస్ పాయింట్లు తగ్గించుతున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు 44 4 రోజుల వరకు ప్రత్యేకంగా డిపాజిట్ చేసుకునే వారికి 7.05 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇకనుంచి 6.85 శాతానికి పడిపోనుంది. సీనియర్లకు మాత్రం 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు రానుంది. అంటే సీనియర్ సిటిజన్స్ 444 రోజులపాటు ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 7.35 శాతం వడ్డీ రేటు రానుంది. ఈ వడ్డీ రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి రావడంతో ఇప్పటివరకు ఈ ప్యాకేజీ కింద డిపాజిట్ చేసుకున్న వారికి నష్టం కలగనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 2025 ఫిబ్రవరిలో రెపోరేటను తగ్గించింది. ఇప్పుడు మరోసారి ప్రత్యేక fixed డిపాజిట్లపై బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉందని యాజమాన్యం తెలిపింది. గతంలో ఓసారి 2025 సంవత్సరంలో రెండు నుంచి మూడుసార్లు వడ్డీరేట్ల సవరణ ఉంటుందని తెలిపింది. అందులో భాగంగానే రెండుసార్లు వాటి రేట్లు మారాయి. అంటే మరోసారి కూడా వడ్డీ రేట్లు మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మూడోసారి వడ్డీరేట్ల మార్పు ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కొత్త వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు ఉండే రిటైల్ డొమెస్టిక్ డిపాజిట్లకు వర్తించనుందని బ్యాంకు యాజమాన్యం తెలిపింది. ఈ డిపాజిట్లకు వడ్డీ రేట్లు వేరువేరుగా ఉంటాయి. బ్యాంకులో పనిచేసే సిబ్బందికి ఈ డిపాజిట్లపై 100 బేసిస్ పాయింట్లు ఇస్తారు.444 డిపాజిట్లపై 7.85 వడ్డీ రేట్లు అందిస్తారు. అయితే ఇప్పుడు 20 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వడ్డీ రేట్లు మిగతా బ్యాంకులకు కూడా వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మిగతా బ్యాంకుల్లో కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. అందులోనూ ప్రత్యేక ప్యాకేజీ డిపాజిట్లు ఈ బ్యాంకులో ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీరికి నష్టం జరిగే అవకాశం ఉంది.