
బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సిద్ధమవుతున్న మూవీ SSMB 29 కి సంబంధించి ఏ ఫొటో వచ్చినా అభిమానులకు మంచి ఫీస్ట్ లాంటిదే. అలాంటి ఇలాంటి ఫీస్ట్ కాదు.. అసలు రాజమౌళి తమ అభిమాన హీరోను ఎలా చూపుతున్నాడని ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతుంటారు. అందులోనూ అందగాడైన మహేశ్ బాబును ఏ విధంగా సిల్వర్ స్క్రీన్ పై చూపించనున్నారన్న ఆసక్తి సర్వత్రా అందరిలోనూ నెలకొని ఉంటుంది. అందుకే రాజమౌళి ఈ మూవీ చిత్రీకరణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
బయటకు రాకుండా…
వందల సంఖ్యలో చిత్ర నిర్మాణంలో పనిచేస్తుండటంతో లుక్స్ రివీల్ కాకుండా షూటింగ్ ప్రారంభానికి ముందే వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. సెల్ ఫోన్లలో చిత్రీకరించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఏదో ఒక ఫొటో బయటకు వస్తుండటం రాజమౌళికి కూడా తలనొప్పిగా మారింది. SSMB 29 మూవీకి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. భారీ ప్రాజెక్టు కావడంతో అందరి అంచనాలు ఈ చిత్రంపై మామూలుగా లేవనే చెప్పాలి.
లేటెస్ట్ లుక్ ఇదే…
ఈ సమయంలో మహేశ్ బాబు తాజా లుక్ బయటకు వచ్చింది. మహేశ్ బాబు విదేశాలకు వెళుతుండగా ఎవరో ఈ చిత్రాన్ని క్లిక్ మనిపించారు. సోషల్ మీడియాలో పో్స్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పొడవాటి గడ్డంతో పాటు గుబురు జట్టుతో కనిపించడంతో అభిమానులు ఖుషీ ఫీలవుతున్నాు. మహేశ్ ఫస్ట్ లుక్ ను చూసిన అందరూ ఇంత అందగా ఉన్నాడేంట్రా అని ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తం మీద మహేశ్ బాబు అదరేటి లుక్స్ అదిరిపోతుందిగా.