
కల్తీ నెయ్యి కేసులో మరో డెయిరీ పేరును స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు చేర్చారు. తిరుమల లడ్డూ లో ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి కలపడంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన హర్ష్ ఫ్రెష్ డెయిరీ పేరు సిట్ అధికారులు చేర్చారు. బోలేబాబా డెయిరీ సంస్థకు చెందిన డైరెక్టర్లే హర్ష్ ఫ్రెష్ డెయిరీకి డైరెక్టర్లుగా ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు తెలిసింది.
కీలక సూత్రధారులుగా…
విపిన్ జైన్, పోమిల్ జైన్ కీలక సూత్రధారులుగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు నిర్ధారణ కు వచ్చి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ నెయ్యి ఘటనకు సహకరించిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. గత కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి పై విచారణను స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.