
కొంత శ్రమ మరియు క్రియేటివిటీ ఉన్నట్లయితే పత్రికలతో బ్యాగులు తయారుచేసి షాపుల దగ్గర అమ్మకాలు చేయవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. చిన్నపాటి పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపారాలలో ఇస్త్రీ సర్వీస్ వ్యాపారం కూడా ఒకటి. ఈ బిజీ కాలంలో చాలామందికి ఇళ్లలో బట్టలు ఉతకడానికి అలాగే ఇస్త్రీ చేయడానికి సమయం ఉండడం లేదు. దీనిని మీరు ఒక వ్యాపారంగా మార్చుకొని ప్రారంభించవచ్చు. దీనికి కేవలం ఒక మంచి ఇస్త్రీ బాక్స్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు 15 మంది కస్టమర్లకు మీరు ఈ సర్వీస్ అందించినా కూడా రోజుకు 300 నుంచి 500 వరకు ఆదాయం పొందవచ్చు. అలాగే మరో మంచి వ్యాపారం ప్యాకింగ్ అండ్ లేబులింగ్.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలతోపాటు మీరు లోకల్ లో ఉన్న మ్యానుఫ్యాక్చర్లతో మాట్లాడుకున్నట్లయితే వాళ్లు చిన్నచిన్న ప్యాకింగ్ పనులను అవుట్ సోర్స్ ఇస్తారు. కేవలం 5000 పెట్టి మీరు టేపులు, బాక్సులు, స్కేల్ మిషన్ వంటివి కొనుగోలు చేసుకుని ఇంటి నుంచి ఇది ప్రారంభించవచ్చు. ఒక్కో ప్యాక్ పై మీకు 2000 నుంచి 5000 వరకు లాభం ఉంటుంది. ఈ మధ్యకాలంలో డబ్బు లేకుండా చేసే మరొక అద్భుతమైన వ్యాపారం బ్లాగింగ్. ఒక ఫ్రీ బ్లాక్ వెబ్ సైట్ ను మీరు క్రియేట్ చేసుకుని అందులో కంటెంట్ పెడితే చాలు. మీ పేజీకి రోజురోజుకు ట్రాఫిక్ పెరిగితే మీకు గూగుల్ యాడ్స్ ద్వారా ఆదాయం వస్తుంది. ప్రతిరోజు మీరు ఆర్టికల్స్ పెట్టుకుంటూ వెళ్తే కేవలం కొన్ని నెలల్లోనే మీరు మంచి ఆదాయం పొందవచ్చు.