
అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల మధ్య నిద్రపోయేవారు ఆరోగ్యపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో నిద్ర పోయే వారికి ప్రధానంగా అల్జీమర్స్ సమస్య వస్తుంది. సాధారణంగానే నిద్ర కరువైతే అల్జీమర్స్ వస్తుంది. అయితే 12 నుంచి రెండు గంటల నుంచి ఎంత సేపు నిద్ర పోయినా ఫలితం ఉండదు.
అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోయే వారిలో దేనిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఏ పని చేయడానికి ఉత్సాహం చూపించరు. దీంతో చాలా పనుల్లో తేడాలు వస్తాయి. అందువల్ల ఈ సమయంలో నిద్ర పోవడం చాలా ప్రమాదకరం. ఈ సమయంలో ఎక్కువగా నిద్రపోయే వారికి మానసిక బాధలు ఎక్కువగా మారుతాయి. దేనితో మీరు ఆల్కహాల్ ఎక్కువగా తాగేస్తుంటారు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎమోషనల్ పెరిగి బిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో నిద్ర పోయేవారు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారు. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడంవల్ల గుండె సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
అందువల్ల అనవసరంగా రాత్రులు మేల్కొని నిద్రను పాడు చేసుకోకుండా ఉండాలి. సాధ్యమైనంతవరకు 11 లోపే నిద్రపోయే ప్రయత్నం చేయాలి. 11 లోపే నిద్రపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 11 నుంచి ఉదయం ఆరు వరకు నిద్రపోయీ సూర్యోదయానికి ముందే లేవడం వల్ల శరీరం యాక్టివ్ గా మారుతుంది. ఉదయం 11 లోపు నిద్రపోవడం వల్ల శరీరంలోని రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాంటి అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుంది. మనిషికి నిద్ర చాలా అవసరం అందువల్ల ప్రతిరోజు 8 గంటల నిద్రపోయే ప్రయత్నం చేయాలి. అయితే ఇది సాధ్యమైనంతవరకు తొందరగా నిద్రపోయే ప్రయత్నం చేయాలి.
అయితే రాత్రిలో విధులు నిర్వహించేవారు.. ఇతర అవసరాల కోసం రాత్రులు మెలకువ ఉండేవారు మాత్రం ఇది మినహాయింపే. ఎందుకంటే వారు రాత్రులు విధులు నిర్వహించి ఉదయం నిద్రపోవడం తప్పనిసరిగా మారుతుంది. అయితే వీరు ప్రశాంతమైన నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఆటంకం కలిగిన నిద్ర కూడా మంచిది కాదు. కలత నిద్ర వల్ల మనసు ఆందోళనగా మారుతుంది. నిద్రపోయిన ఫీలింగ్ ఉండదు.