
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు ఏకంగా 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా రెండు రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో కోటి 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా., సీడెడ్ ప్రాంతంలో 42 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో కోటి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి మరో కోటి 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 5 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం రెండు రోజుల్లోనే 77 శాతానికి పైగా రికవరీ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే కేవలం ఇక కోటి 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే రావాలి, నేటితో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టబోతుంది ఈ చిత్రం. కానీ ఓవర్సీస్ లో ‘సామజవరగమనా’ చిత్రం 1 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ‘సింగిల్’ చిత్రానికి ఆ రేంజ్ థియేట్రికల్ రన్ రాకపోవచ్చు. కానీ హాఫ్ మిలియన్ డాలర్స్ మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా శ్రీ విష్ణు కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది ఈ చిత్రం.