
Shubman Gill: శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి ‘మూడేళ్ల గ్యారెంటీ’ కావాలట.. రవిశాస్త్రి డిమాండ్!
Shubman Gill: ప్రస్తుతం భారత క్రికెట్ టీమ్‌లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్‌లో తన మొదటి అగ్నిపరీక్షలోనే ఫెయిల్ అయింది. లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మన టీమిండియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది.
ఈ ఓటమి తర్వాత చాలా మంది శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై వేలెత్తి చూపుతున్నారు. ఇతనేం కెప్టెన్ రా బాబు అని మాట్లాడుకుంటున్నారు. కానీ, టీమిండియా మాజీ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి మాత్రం గిల్‌కు మద్దతుగా నిలబడ్డాడు. అంతేకాదు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. శుభ్‌మన్ గిల్‌ను మూడు సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా కొనసాగించాలని ఆయన పట్టుబట్టాడు. ప్రస్తుతం టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం బర్మింగ్‌హామ్‌లో తెగ ప్రాక్టీస్ చేస్తోంది. ఆ మ్యాచ్ జూలై 2 నుంచి మొదలవుతుంది.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ఓటమితో మొదలైంది. కానీ రవిశాస్త్రి అభిప్రాయం ప్రకారం.. ఇంగ్లాండ్‌లో గెలవడం అంత ఈజీ కాదు. అందుకే, గిల్‌కు పూర్తి అవకాశం ఇవ్వాలని ఆయన అంటున్నారు. విజ్డెన్ పత్రికతో మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ విషయాలు చెప్పాడు. శుభ్‌మన్ గిల్‌తో సహా అందరికీ తెలుసు, ఇంగ్లాండ్‌లో వాళ్ళ పని అంత తేలిక కాదని. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం సొంత గడ్డపై కాకుండా బయటి దేశంలో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమైన పనుల్లో ఒకటి అని రవిశాస్త్రి వివరించాడు.
భారత్ 2007 తర్వాత ఇంగ్లాండ్‌లో ఏ టెస్ట్ సిరీస్‌నూ గెలవలేదు. పైగా, గత ఆరు నెలల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ముగ్గురు పెద్ద ప్లేయర్లు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు అని ఆయన గుర్తు చేశారు. అంటే, గిల్ పరిస్థితిని అర్థం చేసుకోండని ఆయన ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు గిల్‌పైనే నమ్మకం ఉంచాలని రవిశాస్త్రి కోరుకుంటున్నాడు.
గిల్ ఇప్పుడు చాలా మెచ్యూర్ అయ్యాడు. అందుకే అతనికి మూడేళ్ల పాటు అవకాశం ఇవ్వాలి అని శాస్త్రి చెప్పాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఫలితం ఏమైనా కానివ్వండి, కెప్టెన్‌ను మార్చడం కరెక్ట్ కాదు అని ఆయన తేల్చి చెప్పాడు. మొత్తానికి, రవిశాస్త్రి డిమాండ్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. శుభ్‌మన్ గిల్ రాబోయే మ్యాచ్‌లలో ఎలా రాణిస్తాడో, అతని కెప్టెన్సీ ఎలా ఉంటుందో�వేచి�చూడాలి.