
Shirdi special trains: శ్రద్ధా, భక్తిగల సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. శిరిడీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ – నాగర్సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లు జూలై 3 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది.
స్పెషల్ రైళ్ల వివరాలు:
♦�సికింద్రాబాద్ → నాగర్సోల్ స్పెషల్ (ట్రైన్ నెం. 07007):
♦ ప్రతి గురువారం నడుస్తుంది
♦ రాత్రి 9:20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి
♦ తర్వాత రోజు ఉదయం 9:45కు నాగర్సోల్కు చేరుతుంది
♦ నాగర్సోల్ → సికింద్రాబాద్ స్పెషల్ (ట్రైన్ నెం. 07002):
♦ ప్రతి శుక్రవారం నడుస్తుంది
♦ సాయంత్రం 5:30కు నాగర్సోల్ నుంచి బయలుదేరి
♦ తర్వాత రోజు ఉదయం 7:30కి సికింద్రాబాద్కు చేరుకుంటుంది
రైలు ఆగే స్టేషన్లు:
మల్కాజ్గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బనీ, జాల్నా, ఔరంగాబాద్
అందుబాటులో ఉండే కోచ్లు:
♦ ఫస్ట్ ఏసీ (1AC)
♦ సెకండ్ ఏసీ (2AC)
♦ థర్డ్ ఏసీ (3AC)
శిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రిజర్వేషన్ ముందుగానే చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.