
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో ఐదుగురు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని తెలిపాయి. ఇందులో పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు సాయంతో మిగిలిన వారు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఆధారంగా బిజ్ బెహరాకు చెందిన ఆదిల్ తోకర్ అలియాస్ ఆదిల్ గురికి ఈ దాడికి సంబంధం ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. 2018లో పాకిస్తాన్కు వెళ్ళిన ఆదిల్ అక్కడ లక్కరే తోబా సంస్థలో సాయుద శిక్షణ పొంది దాడులు చేసేందుకు తిరిగి భారత్లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు.