
Samantha : హీరోయిన్ గా వెండితెర పై ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ అశేష ప్రేక్షకాభిమానం ని సంపాదించి, ఇండస్ట్రీ లో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన హీరో సమంత(Samantha Ruth Prabhu). నిన్న మొన్నటి వరకు కేవలం సౌత్ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితమైన సమంత, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటుతుంది. అయితే ఇన్ని రోజులు కేవలం హీరోయిన్ గా మాత్రమే కనిపించిన సమంత, మొట్టమొదటిసారి నిర్మాతగా మారి ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్ ని స్థాపించింది. ఈ బ్యానర్ పై ఆమె కొత్త వాళ్ళని పెట్టి ‘శుభమ్'(Subham Movie) అనే చిత్రం చేసింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 9వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటి నుండే సమంత ప్రొమోషన్స్ ని మొదలు పెట్టింది. అందులో భాగంగా నిన్న ఆమె నెల్లూరు లోని SV గ్రూప్ ఆఫ్ ఇంస్టిట్యూషన్స్ లో నిర్వహించిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నది.
ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నటిగా నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యం తోనే ఇప్పుడు నేను నిర్మాతగా మారాను. నా తొలిసినిమా కొత్తవాళ్లతో తీసాను. వీళ్ళ నటనని చూసిన తర్వాత, నా ‘ఏం మాయ చేసావే’ చిత్రం లో నటనని చూసి, ఇంకా బాగా చేసి ఉండాల్సింది కదా అని అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే నా మీద నాకే సిగ్గు వేసింది. శుభమ్ చిత్రం లో అందరూ కొత్తవాళ్లే నటించారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళు కొత్త నటీనటులుగా అనిపించలేదు. అద్భుతంగా నటించారు, నన్ను ఎంతగానో వాళ్ళ నటన ఆకట్టుకుంది. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది, ప్రతీ ఒక్కరి మనసులను హత్తుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో నటించిన నటీనటులు భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్ళగలరు అని రాసి ఇస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.
ఇకపోతే ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ కండ్రేగుల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. అదే విధంగా హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రీయా వంటి వారు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. వీళ్లంతా కొత్త నటీనటులే. సాంకేతిక నిపుణులు కూడా కొత్తవారే. టాలెంట్ ఉన్న వారిని తన ప్రోత్సాహం తో ఇండస్ట్రీ కి తీసుకొని రావాలని సమంత మంచి ప్రయత్నమే చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే కచ్చితంగా ఒక పది మందికి అయినా సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన టీజర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా కంటెంట్ ఉన్న సినిమా లాగానే అనిపిస్తుంది. చూడాలి మరి ఎంతవరకు ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది.