
పంజాబ్ జట్టు తో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. చెన్నై జట్టు సొంతవేదికపై 191 పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ దూకుడు కొనసాగిస్తున్న వేళ.. ఏమాత్రం వారిని అడ్డుకోలేకపోయింది. బౌలింగ్ లో వైవిధ్యాన్ని చూపడం లో చెన్నై బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతకంటే ముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. ఈ సీజన్లో తొలిసారిగా మెరుగైన బ్యాటింగ్ చేసింది. ఆల్ రౌండర్ సామ్ కరణ్ (88) వీరోచిత పోరాటం చేశాడు. 12 పరుగుల దూరంతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. ఉన్నంతసేపు అతడు మెరుపులు మెరిపించాడు. చెన్నై జట్టు 191 పరుగులు చేయడం వెనుక కీలకపాత్ర పోషించాడు. అయితే ఆఫ్ సెంచరీ చేసిన తర్వాత సామ్ కరణ్ డగ్ అవుట్ లో ఉన్న తోటి ఆటగాళ్లకు విచిత్రమైన సంకేతాలు చేశాడు. ” మైదానంలో పంజాబ్ బౌలర్ల పై ఎలా ఆడుతున్నానో చూశారు కదా.. ఇప్పటికైనా నన్ను గుర్తించండి. అప్పుడప్పుడు కనీసం ఫోన్ చేయండి అంటూ” అతడు సంకేతాలు పంపించాడు. మొత్తంగా చూస్తే చెన్నై జట్టులో విభేదాలు ఉన్నాయని సామ్ కరణ్ సంకేతాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల హైదరాబాద్ జట్టుతో ఎదురైన ఓటమి తర్వాత తాత్కాలిక ధోని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” ఐదారుగురు ఆటగాళ్ల వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నది. వారు ఆడకపోవడం వల్ల జట్టు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందువల్లే ఇలాంటి ఓటములు ఎదురవుతున్నాయని” ధోని వ్యాఖ్యానించాడు. అంటే దీనిని బట్టి కొంతమంది ఆటగాళ్లు జట్టులో క్రమశిక్షణ కోల్పోయారని.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని.. అందువల్ల చెన్నై జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నదని తెలుస్తున్నది. మరి దీనిపై చెన్నై యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అన్నట్టు చెన్నై జట్టు గ్రూప్ దశ నుంచి నిష్క్రమించినప్పటికీ..ఇంకా నాలుగు లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.