
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. అయితే రద్దీ సాధారణంగానే ఉంది. అంత భారీ స్థాయిలో భక్తులు లేరు. అలాగని తక్కువగా కూడా లేరు. వేసవికాలం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సిఫార్సు లేఖలను కూడా రద్దు చేసిన టీటీడీ సామాన్య భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. వీలయినంత త్వరగా ఏడుకొండల వాడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది.
నేడు టీటీడీ బోర్డు సమావేశం…
మరొకవైపు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం నేడు అత్యవసరంగా సమావేశమవుతుంది. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని తెలిసింది. మరొక వైపు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని తెలిసి ముందుగా అన్ని చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కూలర్లను కంపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేయడం దగ్గర నుంచి క్యూ లైన్ లో ఉన్న వారికి మజ్జిగ, మంచినీటిని అందించే చర్యలు చేపట్టింది.
హుండీ ఆదాయం…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,214 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,599 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.