
రోహిత్ శర్మ విషయంలో..
రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అతని ఆధ్వర్యంలో టీమిండియా 2025లో దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. స్వదేశంలో రోహిత్ శర్మ ముంబైలోని వాంఖడే మైదానంలోనే అతడు తన చివరి టెస్ట్ ఆడాడు. ఇక ఆస్ట్రేలియాలో బీజీటీ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా విదేశాలలో తన చివరి టెస్ట్ ఆడాడు. టెస్టులలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగానే వెల్లడించినప్పటికీ.. ఇప్పటికీ సమయం సాయంత్రం 7 గంటల 29 నిమిషాలు కావడం విశేషం. మొత్తంగా అటు ధోని.. ఇటు రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికే క్రమంలో ఇద్దరు ఒకే తరహా విధానాలు అవలంబించడం విశేషం. ఇటువంటి ఘటనలు ఇంతవరకు క్రికెట్లో చోటు చేసుకోలేదు. భవిష్యత్ కాలంలో చోటుచేసుకుంటాయో లేదో తెలియదు. కాకపోతే టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో టి20 వరల్డ్ కప్ విన్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది. ఆసియా కప్ ట్రోఫీలను కూడా అందుకుంది. రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లినప్పటికీ.. విజేతగా మాత్రం నిలవలేకపోయింది. ఇక 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ స్వదేశం వేదికగా ఓటమిపాలైంది. ఒకవేళ టీం ఇండియా ఈ కప్ కనుక గెలిస్తే రోహిత్ శర్మ నాయకుడిగా అద్భుతమైన రికార్డు సాధించేవాడు.ఇక 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ స్వదేశం వేదికగా ఓటమిపాలైంది. ఒకవేళ టీం ఇండియా ఈ కప్ కనుక గెలిస్తే రోహిత్ శర్మ నాయకుడిగా అద్భుతమైన రికార్డు సాధించేవాడు.