
ఒంగో్లులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. కారును లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలసులు తెలిపారు. ఈరోజు తెల్లవారు జామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
కారును లారీ ఢీకొట్టడంతో…
కారులో ఉన్నవారు చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న పావని, కౌశిక్, అక్కడికక్కడే మరణించారు. గుంటూరు నుంచి తిరుమలకు వెళుతుండగాఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.