
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం కానున్నారు. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ అందుబాటులో ఉన్న స్థానిక మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు.
భయభ్రాంతులకు గురి కావద్దని…
అర్ధరాత్రి పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించడంపై హైదరాబాద్ లోనూ అప్రమత్తం అయ్యారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.