
దేశంలోనూ జనగణనతో పాటు కులగనన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ అని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ చేసిన పాదయాత్రలో రాహుల్ గాంధీ కులగణన చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కులగణన చేసి వెనకబడిన వర్గాల వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని కూడా రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు.
తూతూ మంత్రంగా…
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాను రాజకీయం చేయదలచుకోలేదని, అదే సమయంలో కులగణనపై తమ ప్రభుత్వానికి అవగాహన ఉందని కూడా చెప్పారు. కులగణన కోసం దేశ వ్యాప్తంగా కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని, కులగణన కోసం తెలంగాణను మోడల్ గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇందుకోసం మంత్రులతో కమిటీని నియమించాలన్న రేవంత్ రెడ్డి తూతూమంత్రంగా చేయడం వల్ల ఉపయోగం ఉండదని కూడా సూచించారు.