
#Retro festival start @JayalaxmiPpm pic.twitter.com/FmzkOHHiXF
ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు వింటేజ్ సూర్య మాస్ అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు మన యూత్ ఆడియన్స్ మొదటి నుండి బాగా అలవాటు పడ్డారు. ఆయన స్క్రీన్ ప్లే ని , టేకింగ్ ని నచ్చని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఈ సినిమాలో ఆయన మార్క్ అడుగడుగునా కనిపించిందని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో, ఎక్కడా బోర్ కొట్టకుండా తీయడం లో సక్సెస్ అయ్యాడట కార్తీక్ సుబ్బరాజ్. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం లవ్, ఎమోషన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయని అంటున్నారు. ఒక మంచి సినిమాని చూసాము అనే ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ నుండి బయటకి వస్తారని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.
— ℝ (@Tonystark464517) May 1, 2025
Thalaivan tharisanam
Kallakurichi sfc#RetroFromToday pic.twitter.com/iGKxmn9krz— Suriya editsz (@Ajisuriya18) May 1, 2025
ఇక సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని అంటున్నారు. కన్నిమ్మ పాట థియేటర్స్ లో ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందట. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేశారట. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇష్టపడుతారు. వింటేజ్ సూర్య మార్క్ సినిమాలను మిస్ అవుతున్నాము అని ఫీల్ అయ్యే ఆయన అభిమానులకు ఈ చిత్రమే సమాధానం. ‘కంగువ’ లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాతో కంగుతున్న అభిమానులు, ఈ చిత్రం తో ఎంతో సంతృప్తి పడ్డారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది చూడాలి.
Celebration at @cinemassdc #RetroFromToday #Retro pic.twitter.com/OvSnNREPY0
— J E E V A N A N T H A M (@J_Since2000) May 1, 2025