
నిన్న ప్రముఖ న్యాయవాది లాల్ చౌహాన్ ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయని, తక్షణమే అతని పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు. తీవ్రవాదులు చేసిన దుశ్చర్యలను తమతో పోల్చి చూడడం అమానుషం అని ఆదివాసీ JAC ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే పోలీసులు ఇంకా విజయ్ దేవరకొండ పై కేసు నమోదు చేయలేదు. ఈ అంశంపై న్యాయపరమైన సలహాలు తీసుకోవడం అవసరమని, పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారట. అయితే JAC నేతలు అనంతరం మీడియా తో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ మా మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఈ అంశం పై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. బహుశా ఆయన వరకు ఈ అంశం చేరిందో లేదో తెలియదు.
ఇకపోతే విజయ్ దేవరకొండ రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి తో కలిసి ‘కింగ్డమ్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రమిది. ‘జెర్సీ’ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా ని తీసిన డైరెక్టర్ కావడంతో, కచ్చితంగా ఈ చిత్రం భారీ హిట్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొన్న సాయంత్రం ఈ చిత్రం లోని మొదటి పాటకు సంబంధించిన ప్రోమో వీడియో ని విడుదల చేసారు. నేడు పూర్తి పాటని విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సినిమా భారీ విజయం సాధించడం విజయ్ దేవరకొండ కు ఇప్పుడు అత్యవసరం. మే30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.