మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకని నాసిరకం కథలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలా కాకుండా ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
ఇక ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. వెంకీ అట్లూరి ఇప్పటికే సార్ (Sir), లక్కీ భాస్కర్ (Luckky Bhaskar) లాంటి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. మరి ఈ రెండు సినిమాలు కూడా అతనికి మంచి గుర్తింపుని తీసుకురావడమే కాకుండా దర్శకుడిగా తన ప్రతిభను సైతం ప్రేక్షకులకు తెలిసేలా చేశాయి.
మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే సూర్యతో చేయబోయే సినిమా కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తుంది అంటూ ఆయన భారీ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుండటం విశేషం
