
దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్ కింద ఇరవై రూపాయల కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వాటిపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని తెలిపింది. కొత్త వాటిపై మాత్రం ఆ సంతకం ఉండదని తెలిపింది.
కొత్త ఇరవై రూపాయల నోట్లు
రాబోయే కొత్త ఇరవై రూపాయల నోట్లు పాతవాటి మాదిరిగానే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారి సంతకంతో ఆర్బీఐ కొత్త నోట్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఇరవై రూపాయల నాణేలను ఇటీవల విడుదల చేసిన ఆర్బీఐ తాజాగా అదే విలువైన కరెన్సీ నోట్లను జారీ చేయనుంది.