
విపరీతమైన వర్షం
చాలా రోజుల గ్యాప్ తర్వాత ఐపీఎల్ మళ్ళీ మొదలు కావడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విపరీతమైన సందడి నెలకొంది. అభిమానులు భారీగా స్టేడియానికి చేరుకున్నారు. అయితే వారి ఆశలపై వర్షం నీళ్ళు చల్లింది. కుండపోతగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో రెండు చెట్లకు చెరొక పాయింట్ లభించింది. కోల్ కతా 13 మ్యాచ్ లలో ప్రత్యర్థులతో తలపడింది… 5 విక్టరీలు మాత్రమే సాధించింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు బెంగుళూరు 17 పాయింట్లు ఫస్ట్ ప్లేస్ చేరుకుంది. ఇక మరో రెండు మ్యాచ్లు బెంగళూరు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క దాంట్లో విజయం సాధించినా ప్లే ఆఫ్ వెళ్తుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లడం లాంచనమే. అయితే ఈసారి బెంగళూరు ప్లేయర్లు ప్రారంభం నుంచి పకడ్బందీగా ఆడుతున్నారు. కీలకమైన మ్యాచులలో సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో సత్తా చూపిస్తున్నారు. అందువల్లే తమ జట్టును ఈసారి ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్లారు. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే బెంగళూరు విజేతగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరో వైపు బెంగళూరు జట్టుకు అభిమానులు బలమైన సపోర్ట్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఈ సాలా కప్ నమదే అంటూ నినాదాలు చేస్తున్నారు.