
* సోషల్ మీడియా డిపి పెట్టుకోండి
ఇప్పటికే సీఎం చంద్రబాబు( CM Chandrababu) భద్రతకు సంబంధించి రాష్ట్ర పోలీస్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు భద్రత పెంచాలని డిజిపి నిర్ణయించారు. అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరికీ నా విజ్ఞప్తి. దేశ సమగ్రతను దెబ్బ తీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ.. మనమందరం కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకు సంకేతంగా మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అకౌంట్లో ఈ డీపీని పెట్టుకోండి. వందేమాతరం అంటూ నినదించండి అంటూ పిలుపునిచ్చారు నారా లోకేష్.
* తెలుగు ప్రజా ప్రతినిధుల మద్దతు..
ఆపరేషన్ సిందూర్( operation sindoor ) విజయం పై తెలుగు ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద స్థావరాలపై భారత దాడులకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా దౌత్య పరమైన చర్యలు తీసుకోవాలని.. ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని ఎక్కువమంది సూచించారు. టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు.. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో అక్కడి మిలటరీ అధికారులు పాల్గొన్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చిన క్రమంలో భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని శ్రీకృష్ణదేవరాయలు కోరారు.