గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు డీలా పడిపోయిన ఆయన మరోసారి పెద్ది సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను సైతం బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా పుష్ప 2 (Pushpa 2) సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది.
పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి అత్యధికంగా కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం… మరి ఈ సినిమా రికార్డును సైతం బ్రేక్ చేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఎవరితో పోటీ పెట్టుకోడు. కానీ సినిమాలపరంగా మాత్రం తను నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని అతని కోరిక…
అందువల్లే తను మంచి సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తాడు. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయన కంటూ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు రాబోతుంది. అనేది తెలియాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
