
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) ఇప్పటి వరకు తానూ పని చేసిన సినిమాలకు రెమ్యూనరేషన్ రూపం లో కాకుండా, లాభాల్లో వాటాలు పంచుకున్న సంగతి తెలిసిందే. #RRR , బాహుబలి సిరీస్ కి ఆయన ఆ ఫార్ములా నే అనుసరించాడు. కానీ ఇండియా లోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన IMDB సంస్థ ఇచ్చిన లేటెస్ట్ నివేదిక లో రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒక ప్రత్యేకమైన నివేదిక ఇచ్చింది. రాజమౌళి ఒక్కో సినిమాకు 200 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇది లాభాల్లో వాటాగానే ఆయన తీసుకున్నాడట. దేశం లో ఈ స్థాయి రెమ్యూనరేషన్ కేవలం డైరెక్టర్స్ లో మాత్రమే కాదు, హీరోలు కూడా తీసుకోవడం లేదు. ఆ విధంగా చూసుకుంటే రెమ్యూనరేషన్ విషయం లో హీరోలు, డైరెక్టర్స్ అందరిని కలిపి చూసినా రాజమౌళి నే నెంబర్ 1 అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మన తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డుని సైతం తెచ్చిపెట్టిన రాజమౌళి కి కాక ఇంకెవరికి ఇస్తారు అంతటి రెమ్యూనరేషన్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి తర్వాతి స్థానం లో ప్రశాంత్ నీల్, సందీప్ వంగ వంటి వారు నిల్చారట. వీళ్లిద్దరు ఒక్కో సినిమాకు 90 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటారట. ఇక డైరెక్టర్ సుకుమార్, రాజ్ కుమార్ హిరానీ వంటి వారు 80 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటారని తెలుస్తుంది. రీసెంట్ గా అట్లీ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి అట్లీ రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. లాభాల్లో వాటాలను అడిగాడట. అంటే దాదాపుగా 125 కోట్ల రెమ్యూనరేషన్ అని టాక్.
ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మహేష్ బాబు దాదాపుగా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. రాజమౌళి 200 కోట్లు కాబట్టి, మహేష్ కంటే రెండింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ కి ఇదే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా. మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాకు వంద కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక హీరో గా మహేష్ కి కూడా ఈ చిత్రం ద్వారా ఒక ట్రాక్ రికార్డు నమోదైంది. ఇకపోతే రీసెంట్ గానే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ కాంబినేషన్, త్వరలోనే రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టుకోనుంది. ఈ షెడ్యూల్ తర్వాత నాన్ స్టాప్ గా విరామం లేకుండా షెడ్యూల్స్ ఉంటాయని తెలుస్తుంది. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక వివరాలు బయటకు రానున్నాయి.