
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానంలో పిటీషన్ వేసి రాజ్ కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని లోతుగా విచారణ చేయనుంది.
కస్టడీకి, బెయిల్ పిటీషన్ పై…
ఈ నెల 8వ తేదీ వరకూ సిట్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో కూపీ లాగనున్నారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా కసిరెడ్డి చాణక్య కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ8గా ఉన్న చాణక్య ను కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. ఇదే సమయంలో ఈ కేసులోనే సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్‌పైనా నేడు విచారణ జరగనుంది.