
ఎక్కడ అమరుస్తారంటే?
ఈ ప్రత్యేక గడియారాలు జైపూర్‌తో సహా అనేక స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి వీటిని తయారు చేయాలి అనుకుంటున్నారు. అయితే సమయ ఏకరూపతను కాపాడుకోవడానికి జైపూర్‌తో సహా దేశంలోని అనేక ప్రధాన రైల్వే స్టేషన్లలో ఇలాంటి డిజిటల్ గడియారాలను ఏర్పాటు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. ప్రస్తుతం, స్టేషన్లలో వివిధ డిజైన్లు, పరిమాణాల గడియారాలు ఏర్పాటు చేశారు. వీటిని PSU “CRIS” (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పర్యవేక్షిస్తుంది.
మే 31 లోపు మీ డిజైన్‌ను ఆన్లైన్లో సమర్పించండి.
రైల్వే సీపీఆర్ఓ శశి కిరణ్ మాట్లాడుతూ, ఈ పోటీ ప్రధాన లక్ష్యం ఏకరీతి డిజిటల్ గడియార రూపకల్పనను సిద్ధం చేయడమేనని అన్నారు. ఈ పోటీలో పాల్గొనాలి అనుకునేవారు కచ్చితంగా తమ డిజైన్లను ఈ నెల చివరి తేదీ లోపు ఆన్ లైన్ లో సబ్మిట్ చేయాలి. డిజైన్ అసలైనదిగా, ఆకర్షణీయంగా, అధిక రిజల్యూషన్‌లో ఉండాలి.
మీకు కళలో ప్రతిభ ఉంటే రైల్వేల నుంచి 5 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మూడు విభాగాలలోనూ మొదటి స్థానంలో నిలిచిన విజేతకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల బహుమతి లభిస్తుంది. అంతేకాదు ప్రతి విభాగంలో 5 కన్సోలేషన్ బహుమతులు కూడా ఇస్తారు. వీటి మొత్తం ఒక్కొక్కరికి రూ. 50,000. మీకు సృజనాత్మక ఆలోచన, కళ పట్ల ప్రతిభ ఉంటే ఈ పోటీ మీకు ఒక పెద్ద అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని వాచ్ డిజైన్ చేయండి. లక్షల బహుమతి పొందే అవకాశాన్ని మీరే కొట్టేయండి.