
ఐపీఎస్ సీజన్ లో అందాల భామలు ఫ్రాంచైజెస్ ఓనర్లుగా ఉన్నారు. స్టేడియానికి వచ్చి మరీ వారు తమ జట్టు ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యా మారన్, పంజాబ్ కింగ్స్ కు ప్రీతి జింటా, ముంబయి ఇండియన్స్ కు నీతూ అంబానీ స్టేడియానికి వచ్చి మరీ తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. అందుకే స్టేడియంలో ఈ వీళ్ల మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆ జట్టు ఫోర్ కొట్టినా, సిక్సర్ బాదినా… చివరకు ప్రత్యర్థి వికెట్ తీసినా సరే ఎగిరి గంతులేస్తూ స్టేడియంలో కనువిందు చేస్తున్నారు.
తమ జట్టు ఆటగాళ్లను…
కేవలం ఆటగాళ్లను ప్రోత్సహించడం కోసమే వచ్చినా కెమెరాలన్నీ వీరివైపు ఎక్కువ సార్లు ఫోకస్ అవుతుంటాయి. పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ సొట్టబుగ్గల సుందని ప్రీతి జింటా కూడా అంతే. తమ జట్టు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ, గెలిచిన తర్వాత వచ్చి బాగా ఆడిన ప్లేయర్ కు హగ్ ఇస్తూ మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నారు. ఇటీవల పంజాబ్ కింగ్స్ గెలుపునకు కారణమయిన యజువేంద్ర చాహల్ కు ఒక హగ్ ఇవ్వడమే కాకుండా అతనిని ప్రశంసించడాన్ని కూడా కెమెరాలన్నీ బంధించాయి.
రెండో స్థానంలోకి…
ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్ జట్టు పది మ్యాచ్ లు ఆడింది. వీటిలో ఆరు మ్యాచ్ లలో గెలిచింది. మూడింటిలో మాత్రమే ఓడింది. ఒక మ్యాచ్ కు వర్షం పడటంతో రద్దయి ఒక పాయింట్ సాధించింది. దీంతో పదమూడు పరుగులతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానంలోకి ఎగబాకింది. నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించడంతో ఇది సాధ్యమయింది. దీంతో ఇక జట్టు ఓనర్ ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.