
సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటి ప్రగతి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె పలు సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర మీద కూడా ప్రేక్షకులను అలోచించింది. కానీ కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. ఈమె వైవాహిక జీవితంలో మాత్రం చాలా కష్టాలు పడింది. కొన్ని కారణాల వలన తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రగతి తన కూతురితో పాటు బయటకు వచ్చేసి ఒంటరిగా జీవితం గడుపుతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో నటి ప్రగతి స్వయంగా కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని నా జీవితంలో అతిపెద్ద పొరపాటు చేశానని చెప్పింది.
ఆ సమయంలో తాను తీసుకున్న ఆ నిర్ణయం వలన తన జీవితం పది,ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని ప్రగతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించడంతో ఈ విషయంపై ఆమె ఓపెన్ అయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తోడు ముఖ్యం. కానీ తన మెచ్యూరిటీ లెవెల్ కు సరిపడే వ్యక్తి దొరకడం చాలా కష్టమే అంటూ ప్రగతి తెలిపింది. పెళ్లి చేసుకున్న తర్వాత పెట్టే కట్టుబాట్లు తాను భరించలేనని ఈ విధంగా ఆమె చెప్పుకొచ్చింది. ఒకవేళ తనకు 20 ఏళ్ల వయసు ఉండి ఉంటే తాను రెండో పెళ్లి గురించి ఆలోచించే దానిని అని కానీ ఆ సమయం ఇప్పుడు దాటిపోయిందని నటి ప్రగతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.