
కానీ ఇప్పుడు మాత్రం మాస్ బాట పట్టి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను సైతం బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేశాడు. మరి ఇలాంటి సందర్భంలో సుకుమార్ నుంచి రాబోయే సినిమాల మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి…
ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాలు సైతం అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి కథలను ఎంచుకొని సినిమాలు గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ తర్వాత ఆయన ప్రభాస్ తో ఒక సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరికొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (Fouji) ane సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి.