Prabhakar: కార్తీక దీపం వంటి సెన్సేషనల్ సీరియల్ లో మోనిత అనే లేడీ విలన్ క్యారక్టర్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి శోభా శెట్టి(Shobha Shetty). ఈమె బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, సీరియల్స్ లో కాదు, రియల్ లైఫ్ లో విలన్ అనే రేంజ్ లో నెగటివిటీ ని సంపాదించుకొని బయటకు వెళ్ళింది. అదే విధంగా ఈమెని అభిమానించే వాళ్ళు, బలమైన అమ్మాయి అని పొగిడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గత ఏడాది ఈమె కన్నడ బిగ్ బాస్ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టి, అక్కడి కంటెస్టెంట్స్ కి గడగడలాడించింది. ఈమె ఆట తీరుని నచ్చి, భారీ స్థాయిలో ఓట్లు కూడా వేసేవారు అక్కడి ఆడియన్స్. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఒకవేళ ఆమె ఆ షోలో కొనసాగి ఉండుంటే టాప్ 5 వరకు వచ్చేది.
అయితే శోభా శెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ జరుగుతుందని ఆమెని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కోపం తెచ్చుకోవడం తో అలిగి షో నుండి వెళ్ళిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ వారం జీ తెలుగులో ‘సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్’ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఈ షో కారణంగానే సుడిగాలి సుధీర్, యాంకర్ రవి గతంలో వివాదాల్లోకి చిక్కుకున్నారు. అయితే యాంకర్ రవి ఈ షో నుండి తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి అర్జున్ అంబటి వచ్చాడు. ఈ షోకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అది బాగా వైరల్ గా మారింది. ఈ వారం గేమ్స్ ఆడేందుకు ‘చామంతి’, ‘ఎన్నాళ్ళో వేచిన హృదయం’ సీరియల్స్ నటీనటులు విచ్చేసారు.
‘ఎన్నాళ్ళో వేచిన హృదయం’ సీరియల్ తరుపున గెస్ట్ గా శోభా శెట్టి వచ్చి గేమ్స్ ఆడింది. అదే విధంగా ‘చామంతి’ సీరియల్ తరుపున ప్రభాకర్ వచ్చి గేమ్స్ ఆడాడు. ‘పాపాల రాయుడు’ గా ఆయన తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. అయితే శోభా శెట్టి ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ‘ఎంతసేపు ఆపుతారయ్య..ఎందుకు గేమ్..తీసి దొబ్బంది అవతలకి’ అని అరుస్తాడు. అప్పుడు శోభా శెట్టి మాట్లాడుతూ ‘మీరు కంటెంట్ కోసం ఇలా అరవడం వంటివి చేస్తే, నాకు అందులో ఎలాంటి ఆసక్తి లేదు’ అని అంటుంది, అప్పుడు ప్రభాకర్ ‘కంటెంట్ నేను ఎలాగైనా ఇవ్వగలను, కంటెంట్ కి నువ్వు అవసరం లేదు’ అని అరుస్తాడు. అలా ఒకరికి ఒకరు వాదనలు వేసుకుంటూ ఉండడంతో శోభా శెట్టి అలిగి షో నుండి వాకౌట్ అయ్యింది. గేమ్ ఆడలేనప్పుడు ఎందుకు సపోర్టుగా రావడం అంటూ యాంకర్ అషు రెడ్డి కామెంట్ చేస్తుంది. ఈ వీడియోని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
