
Photo Story : కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో తెలుగు సినిమా హీరో ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది అటు సినిమాలతో ఇటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. మోడలింగ్ రంగంలో తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకగా ముందుకు దూసుకుపోతుంది. తెలుగు తో పాటు తమిళ్, హిందీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తుంది. మోడల్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ చిన్నది బాలీవుడ్లో అవకాశాలు అందుతుంది. ఆమె చేసిన సినిమా పరాజయం అయినప్పటికీ కూడా నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో టాలీవుడ్ హీరోను ప్రేమించు పెళ్లి కూడా చేసుకుంది. ఈమె మరి ఎవరో కాదు శోభితా ధూళిపాల. సౌత్ సినిమా ఇండస్ట్రీలో శోభిత ధూళిపాల తనదైన ముద్ర వేసుకుంది. తన అద్భుతమైన నటనతో నార్త్ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అచ్చ తెలుగు అమ్మాయి. శోభిత ధూళిపాల ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలికి చెందిన అమ్మాయి. శోభిత మే 31, 1992లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. శోభిత తండ్రి మర్చంట్ నేవీ ఇంజనీర్ అలాగే తల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు.
శోభిత ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో పెరిగింది. తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శోభిత ధూళిపాల ముంబై కు వెళ్లి ముంబై విశ్వవిద్యాలయంలో హెచ్ ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో కార్పొరేట్ లా పూర్తి చేసింది. ఈమె కూచిపూడి మరియు భరతనాట్యంలో శిక్షణ పొందిన క్లాసికల్ డాన్సర్ గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె వార్షిక అనేది బాల్ పిన్ నేవీ క్వీన్ గా 2010లో కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. అలాగే భారతదేశం తరపున ఫిలిప్పీన్స్ లో జరిగిన మిస్ ఎర్త్ 2013లో ప్రాతినిధ్యం వహించింది.
అలాగే శోభిత దూళిపాల మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీ ఫర్ ఏ కాజ్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్ అలాగే మిస్ టాలెంట్ టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. ఈమె కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2014 ఎడిషన్ లో కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో 2016లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శోభిత నటించిన మేడిన్ హెవెన్ సిరీస్ భారీ విజయం సాధించింది. అలాగే ఈ చిన్నది గూడచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయింది. శోభిత దూళిపాల పొన్నియన్ సెల్వన్, కురుప్,ముతన్ వంటి సినిమాలతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.