
మెగాస్టార్ తనయుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్(Ram Charan) మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో ఇకమీదట చేయబోతున్న సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో రామ్ చరణ్ మార్కెట్ కొంతవరకు పడిపోయింది. తద్వారా ఇకమీదట చేయబోతున్న సినిమాలతో మంచి విజయాలను సాధించి తన మార్కెట్ ను పెంచుకోవడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ అయితే ఉన్నాడు. మరి ఇక మీదట ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా క్రేజ్ పరంగా కూడా జనాల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ గత కొన్ని రోజుల నుంచి డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ లో అదరగొట్టిన రామ్ చరణ్ పెద్ది సినిమాలో కూడా అలాంటి ఒక యాసతోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఎలివేషన్స్ ఉండడమే కాకుండా హీరో క్యారెక్టరైజేషన్స్ మీద కూడా ఈ సినిమా డిపెండ్ అయి ఉంటుందని సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
ఇక ఈ సినిమా వల్ల రామ్ చరణ్ భారీ క్రేజ్ ను సంపాదించుకోబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక బుచ్చిబాబు ఈ సినిమాని టాప్ లెవల్లో నిలపడమే కాకుండా ఈ సినిమాతో ఒక వండర్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట.
మరి ఆయన కనక ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిపితే బూచి బాబు స్టార్ డైరెక్టర్ గా మారతాడు. తద్వారా తనను తాను ప్రూవ్ చేసుకున్న వాడవుతాడు… ఇక రామ్ చరణ్ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ అయితే కనిపిస్తాయట. ఆయనలో మాస్ యాంగిల్ చూపిస్తూనే కామెడీని కూడా చాలా జన్యున్ గా పండించే ప్రయత్న అయితే చేస్తారట… ఆయన తన నటనలో మొదటి నుంచి చివరి వరకు విపరీతమైన షేడ్స్ ను చూపిస్తూ డిఫరెంట్ నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.