
నేటి నుండి పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. మే 8వ తారీఖు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ తో ‘హరి హర వీరమల్లు’ చిత్రం పూర్తి కానుంది. ఇక వచ్చే వారం నుండి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల చేసారు. మొదటి పాటకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, రెండవ పాటకు పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మూడవ పాట ని విడుదల చేయబోతున్నారట. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య వచ్చే ఒక మాంటేజ్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఇక ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేస్తారట. సినిమా మీద హైప్ ని ఆకాశానికి తీసుకెళ్లే విధంగా ఈ మేకింగ్ వీడియో ఉంటుందట.
అదే విధంగా థియేట్రికల్ ట్రైలర్ ని కట్ చేసి చాలా రోజులే అయ్యిందట. ఈ ట్రైలర్ ని కూడా ఇదే నెలలో విడుదల చేయబోతున్నారు. ‘మనది కల్కి కంటే గొప్ప సినిమా..చావా కూడా పనికి రాదు..ట్రైలర్ ని చూస్తే మీరే అర్థం చేసుకుంటారు ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది’ అంటూ నిర్మాత AM రత్నం తనకు ఫోన్ చేసే బయ్యర్స్ తో చెప్తూ ఉన్నాడట. థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసిన తర్వాత చివర్లో ఒక సాంగ్ ని విడుదల చేస్తారట. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 30న కానీ, లేదా జూన్ 12 న కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రాబోతుంది. ఈసారి విడుదల తేదీని ప్రకటిస్తే మార్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేస్తున్నాడు కాబట్టి.