
ఐఐటి విలేజ్ గా..
బీహార్ రాష్ట్రంలోని పట్వా టోలి పేరుతో ఓ గ్రామం ఉంది. దీనిని మాంచెస్టర్ ఆఫ్ బీహార్ అని పిలుస్తుంటారు. ఈ గ్రామంలో వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో చేనేత వస్త్రాలకు విపరీతమైన ఆదరణ ఉండేది. అందువల్లే ఈ గ్రామం మాంచెస్టర్ ఆఫ్ బీహార్ గా స్థిరపడింది. అయితే 1991 నుంచి ఈ క్రమంగా ఐఐటీ విలేజ్ గా రూపాంతరం చెందింది. 1991లో జితేంద్ర పర్వ అనే అబ్బాయి ఐఐటీలో ర్యాంక్ సాధించాడు. దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. జితేంద్ర ఉన్నత చదువులు చదివి.. అమెరికాలో ఒక కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగ సంపాదించాడు. కెరియర్ పరంగా అతను ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే జితేంద్ర తన గ్రామం గురించి ఆలోచించాడు. ఆ తర్వాత సెలవులకు స్వగ్రామం వచ్చిన ప్రతిసారి.. అమెరికాలో తన ఉద్యోగం.. అనుభవిస్తున్న హోదాలు.. సంపాదిస్తున్న డబ్బుల గురించి గ్రామస్తులకు చెప్పేవాడు. దీంతో ఆ గ్రామంలోని విద్యార్థులకు ఐఐటి లలో చదువుకోవాలని కోరిక పెరిగింది. ఇక 1996లో కొంతమంది విద్యార్థులు మంచిర్యాంకులు సాధించారు. ఇలా 2002 నాటికి ఆ గ్రామంలో ఐఐటీలో చదివిన వారి సంఖ్య 25కి పెరిగింది. క్రమక్రమంగా ఆ గ్రామంలో ఇంజనీర్లు 75 మందికి చేరుకున్నారు. అలా వారు సాధించిన విజయం ఆ గ్రామంలోని మిగతా విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది..
సొంత ఊరికి వచ్చి..
2013లో జితేంద్ర సొంత ఊరుకి వచ్చి వృక్ష సంస్థాన్ అనే ఎన్జీవో సంస్థను స్థాపించారు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఐఐటీ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీనికోసం భారీ స్థాయిలో లైబ్రరీలు ఏర్పాటు చేశారు. ఐఐటీలో చదివే పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత గైడ్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. ఎలాంటి విధానంలో చదవాలో చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్, భోజనం కూడా పెట్టేవారు.
పూర్వ విద్యార్థులే తరగతులు చెబుతున్నారు
వృక్ష సంస్థాన్ లో జితేంద్ర పూర్వ స్నేహితులే తరగతులు చెబుతుండడం విశేషం. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఆన్లైన్లో కూడా తరగతిలో చెబుతున్నారు. ఇటీవలి ఐఐటి ఫలితాలలో ఈ గ్రామానికి చెందిన 40 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వృక్ష సంస్థాన్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో 28 మంది అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మొత్తంగా తమ గ్రామం పేరు జాతీయస్థాయిలో మార్మోగేలా చేశారు.