
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్పై నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయి. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్పై నేడు సీఐడీ కోర్టు తీర్పు చెప్పనుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వంశీ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ లభించినా వల్లభనేని వంశీ బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవు.
ఈరోజు నూజివీడు కోర్టులో…
తాజాగా వల్లభనేని వంశీపై నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ ను పోలీసులు దాఖలు చేశారు. పీటీ వారెంట్ హనుమాన్ జంక్షన్ పోలీసులు దాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని వంశీపై కేసు నమోదయింది. దీంతో నేడు నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీని పోలీసులు హాజరుపర్చనున్నారు.