
తెలుగుతోపాటు కన్నడలో కూడా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతను మరెవరో కాదు కాంతారా సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం అందుకున్న హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఈ హీరో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రిషబ్ శెట్టి కన్నడ రాష్ట్రంలో కెరాడి అనే గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచి రిషబ్ శెట్టి చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. అప్పట్లో జూడో పోటీల్లో చాలా పథకాలు కూడా సొంతం చేసుకున్నాడు. దూరదర్శన్ లో వచ్చే హీరో రాజ్ కుమార్ పాటలు అంటే రిషబ్ శెట్టికి చాలా ఇష్టం. ఆ సమయంలోనే అతను నటుడు కావాలని అనుకున్నాడు. అప్పుడు ఏర్పడిన ఆసక్తితోనే డిగ్రీ పూర్తి కాకుండానే ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకోవడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రిషబ్ శెట్టి చేరాడు. ఆ సమయంలోనే ఖర్చుల కోసం మినరల్ వాటర్ అమ్మడం వంటి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.
ఈ విధంగా రాత్రంతా మినరల్ వాటర్ సప్లై చేసి ఆ వ్యాన్ లోనే రాత్రికి నిద్రపోయి ఉదయాన్నే తన అక్క ఇంటికి వెళ్లేవారట. తను వాటర్ సప్లై చేస్తున్న క్లబ్ కు కన్నడ నిర్మాత ఎండి ప్రకాష్ రావడంతో అతనిని ఒక అవకాశం అడిగారట. ఆ విధంగా రిషబ్ శెట్టి కి సైనైడ్ సినిమాకు సహాయ దర్శకుడిగా చేసే అవకాశం వచ్చింది. ఈ విధంగా దర్శకుడిగా మారిన రిషబ్ శెట్టి ఆ తర్వాత తుగ్లక్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా పరాజయం పొందడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఆ తర్వాత రిషబ్ శెట్టి రక్షితశెట్టితో కలిసి తెరికెక్కించిన కిరాక్ పార్టీ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే రిషబ్ శెట్టి ఇండస్ట్రీలో టాప్ దర్శకుడిగా మారారు. ఇక ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన కాంతారా సినిమా అయితే సంచలన విజయం సాధించింది.