
ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తూనే పాకిస్తాన్ పై భారత్ దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తుంది. విదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాలను పంపుతుంది. విపక్ష నేతల నేతృత్వంలోనూ కొన్ని బృందాలను పంపేందుకు సిద్ధమయింది ఈనెల 22, 23 తేదీల్లో విదేశాలకు ఏడు బృందాలు పయనమయై వెళుతున్నాయి. పాక్ ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నంలో భాగంగా భారత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాక్ ఉగ్రవాదం, దుశ్చర్యలను బృందాలు వివరించనున్నాయి.
ప్రపంచ దేశాల మద్దతుకోసం…
అమెరికాకు శశిథరూర్ నేతృత్వంలో బృందం బయలుదేరి వెళ్లనుంది. తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం,ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం బయలుదేరి వెళ్లనుంది. హహాల్గామ్ లో ఉగ్రవాదులు దాడి జరిపి 26 మంది అమాయకులను చంపడంతో పాటు తర్వాత ఆపరేషన్ సిందూర్ పై కూడా వివరించి ఆ యా దేశాల మద్దతు పొందే ప్రయత్నం చేస్తుంది.