
నేడు దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగుతుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ముఖ్య నగరాల్లో నీట్ పరీక్ష కోసం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే అరవై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను విధించారు. దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో నిర్వహించే ఈ పరీక్ష కోసం 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రెండు షిఫ్ట్ లలో…
పరీక్ష కేంద్రంలోకి నిమిషం ఆలస్యమయినా అనుమతించరు. దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పరీక్ష రెండు దశల్లో జరగనుంది. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రెండో షిఫ్ట్ లో పరక్ష జరగనుంది. తెలంగాణ నుంచి 72,507 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.