
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఆమె చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే నిర్మాతగా నిహారిక తీసిన తొలి సినిమానే సక్సెస్ అందుకుంది. నిహారిక పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. ఆమె చైతన్య జొన్నలగడ్డని 2020 లో పెళ్లాడారు. ఐతే కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరు డైవర్స్ తీసుకోవడం జరిగింది. 2023 జూలైలో చైతన్య, నిహారిక డైవర్స్ తీసుకున్నారు. మెగా డాటర్ నిహారిక డైవర్స్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.నిర్మాతగా నిహారిక చేసిన తొలి సినిమా కమిటీ కుర్రాళ్లు సూపర్ సక్సెస్ అందుకుంది. ఐతే నిహారిక పర్సనల్ లైఫ్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నిహారిక పెళ్లి, డైవర్స్ పై స్పందిస్తూ నిహారిక పెళ్లి విషయంలో పొరపాటు చేశామని అన్నారు నాగబాబు. ఐతే ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతోనే విడిపోయారని అన్నారు. ఇద్దరిని ప్రాపర్ గా జడ్జ్ చేయకపోయామని అన్నారు నాగబాబు.
ఇక నిహారిక రెండో పెళ్లిపై కూడా మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే నిహారిక దాని నుంచి బయటకు వస్తుంది. ఏదో ఒకరోజు ఒక అబ్బాయిని చూసుకుని పెళ్లాడుతుంది.. ఇక వాళ్ల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదలచుకోలేదని వాళ్లకు నచ్చినట్టుగా జీవించాలని కోరుతున్నా అన్నట్టుగా చెప్పారు. ఇన్నాళ్లకు నిహారిక డైవర్స్ మీద నాగబాబు స్పందించడం జరిగింది. ఐతే ఆమె పెళ్లి విషయంలో సరిగా జడ్జ్ చేయలేకపోయామని చెప్పడం కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది.
ఇక నిహారిక మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఆమె నిర్మాతగానే కాదు నటిగా కూడా సినిమాలు చేయాలని అనుకుంటుంది. ఆల్రెడీ లేటెస్ట్ గా తమిళ్ లో ఒక సినిమా చేస్తున్న నిహారిక తెలుగులో కూడా మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఓ పక్క తన నిర్మాణంలో సంగీత్ శోభన్ లీడ్ రోల్ లో ఒక సినిమాను మొదలు పెట్టింది నిహారిక. ఐతే నిహారిక ప్రొడక్షన్ లో మెగా హీరోలను కూడా నటింప చేయాలని ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. ఐతే నిహారికకు డైరెక్షన్ కూడా చేయాలని ఉందని ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మరి నిహారిక మెగా ఫోన్ పడుతుందా లేదా అన్నది చూడాలి.