
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కొత్త కథలు వస్తున్నాయి. కొత్త దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ మంచి సినిమాలను చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ‘బలగం’ (Balagam) సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన వేణు ఎల్దండి (Venu Yeldandi) ఇప్పుడు నితిన్ తో ఎల్లమ్మ అనే సినిమాని చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాని మొదట నానితో చేయాలని అనుకున్నప్పటికి నాని ఆ కథను రిజెక్ట్ చేయడంతో నితిన్ తో ఆ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి విజయాన్ని సాధిస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నాని లాంటి స్టార్ హీరో ఈ కథను రిజెక్ట్ చేశాడు. కాబట్టి వేణు చాలా ప్రస్టేజియస్ తీసుకొని ఎలాగైనా సరే ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తాడా? బలగం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఆయన ఈ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంటాడా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే స్టార్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నంలో వేణు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగా పకడ్బందీ ప్రణాళికతో ఈ సినిమాను రూపొందించి ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక దిల్ రాజు (Dil Raju) ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని దిల్ రాజు సైతం భావిస్తున్నాడు. ఎలాగైతే బలగం సినిమాతో తెలంగాణ పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులను అలరించాడో ఇప్పుడు కూడా అలాగే ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటాడని దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఇక ప్రస్తుతం నితిన్ వరుస డిజాస్టర్లను మూటగట్టుకుంటున్నాడు. మరి ఆయనతో ఈ సినిమా చేయడం వల్ల ఈ సినిమాకి ప్లస్ అవుతుందా? లేదంటే మైనస్ గా మారుతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి నితిన్ లాంటి హీరో ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్క భారీ సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నాడు.