
* తీవ్రవిషాదంలో మురళి నాయక్ కుటుంబం
మురళి నాయక్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మురళి నాయక్ చిన్నతనం నుంచి సైన్యంలో( Army) చేరాలని కోరిక ఉండేది. అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్ని వీర్ గా సెలెక్ట్ అయ్యాడు. మురళి నాయక్ తొలితా పంజాబ్, అస్సాంలలో పనిచేశాడు. రెండున్నర ఏళ్ల సర్వీసు పూర్తి కావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో గారాబంగా పెంచారు. ఇటీవలే ఆయనకు పెళ్లి చేయాలని భావిస్తూ ఇల్లు కూడా కట్టుకున్నారు. అతడి మరణం వార్తతో ఇక ఆమె ఎవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు.
* అంత్యక్రియలుకు ఏర్పాట్లు..
ఈరోజు స్వగ్రామంలో వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. మురళి నాయక్ అంత్యక్రియలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. శనివారం రాత్రి కి మృతదేహం కల్లి తాండకు చేరింది. పరిసర గ్రామాల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. అమరవీరుడు మురళి నాయక్ మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు వస్తున్న దృష్ట్యా భద్రతా చర్యలు చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అక్కడకు చేరుకోనున్నారు. మృతుడికి నివాళులు అర్పించనున్నారు.
* ప్రజాప్రతినిధుల సాయం
మరోవైపు అమరవీరుడు మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) సాయం ప్రకటించారు. తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. మే 12న మురళి నాయక స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని బాలకృష్ణ చెప్పారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా తన నెల జీతం రెండు లక్షల పదిహేడు వేల రూపాయలను జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందించారు.