
ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగైదు రోజుల్లో అండమాన్ కు నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయిని చెప్పింది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ, మధ్య బంగాళా ఖాతంలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ శశాఖ తెలిపింది. బుధవారం అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, అది అప్పపీడనం గా మారే ఛాన్స్ ఉందని చెప్పింది.
ఈ ప్రభావంతో…
ఈ నెలాఖరుకు వరకూ దక్షిణ భారత దేశంలో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని చెప్పింది. ఈ ఏడాది త్వరగానే నైరుతి రుతుపవనాలను కేరళ ను టచ్ చేయనున్నాయని కూడా తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.