
నాలుగు వీధి కుక్క పిల్లలను చంపిన వ్యక్తిపై కేసు అల్వాల్, తన పెంపుడు శునకంపై దాడికి పాల్పడిన వీధి కుక్కలను చంపేసిన ఓ వ్యక్తిపై అల్వాల్ ఠాణాలో కేసు నమోదైన సంఘటన ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇంటీరియల్ డెకరేటర్గా పనిచేస్తున్న ఆశీష్ కుటుంబంతో కలిసి బొల్లారంలోని ఒక అపార్టు మెంటులో ఉంటున్నాడు. అతడు శాఖాహారి కావ డంతో తాను పెంచుకుంటున్న రెండు శునకాలకు కూడా శాఖాహారమే అలవాటు చేశాడు. ఈ క్రమంలో అపార్టుమెంట్ పరిసరాల్లో తిరిగే వీధి కుక్కలు తరచూ తన పెంపుడు శునకాలపై దాడికి పాల్పడి గాయప ర్చేవి. దీంతో గత కొంత కాలంగా విసుగు చెందిన ఆశీష్.. ఈ నెల 14న సాయంత్రం ఒక శునకంతో సెల్లార్లోకి రాగానే వీధి కుక్కలు వచ్చాయి. వాటిలో నాలుగు పిల్లలను గోడకు కొట్టి, కాలితో తొక్కి చంపాడు. ఈ మేరకు స్థానిక జంతు ప్రేమికులు బుధ వారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.