
Upcoming Mahindra Cars: మహీంద్రా ఎస్యూవీ భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. వీటిలో మహీంద్రా స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ 3XO, ఎక్స్‌యూవీ 700 వంటి ఎస్‌యూవీలు ఉన్నాయి. మీరు కూడా రానున్న రోజుల్లో కొత్త మహీంద్రా ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే మీకో శుభవార్త. నిజానికి, కంపెనీ వచ్చే ఏడాది అంటే 2026లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. రాబోయే మూడు ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.
Mahindra Bolero Facelift
మహీంద్రా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలలో ఒకటైన బొలెరోను అప్డేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది 2000 సంవత్సరంలో ప్రారంభించిన బొలెరో, బ్రాండ్ లైనప్‌లో అత్యంత పురాతనమైన మోడల్. బొలెరో పేరు కూడా మారే అవకాశం ఉంది. కొత్త బొలెరోలో కస్టమర్లు మార్చిన ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ పొందుతారని భావిస్తున్నారు.
Mahindra Thar Facelift
2020 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మహీంద్రా రెండవ తరం థార్, తదుపరి అప్‌గ్రేడ్ పొందబోతోంది. అప్‌గ్రేడ్ చేసిన మోడల్లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త రేడియేటర్ గ్రిల్, కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్వీక్డ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్లు,రిఫ్రెష్డ్ బంపర్లు వంటి మార్పులు ఉండచ్చు. క్యాబిన్లో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు.
Mahindra XUV700 Facelift
కంపెనీ 2026లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని కూడా అప్డేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అప్డేటెడ్ ఎస్‌యూవీలో కనెక్ట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, యాంబియంట్ లైటింగ్‌తో కూడిన కొత్త పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 12.3-అంగుళాల ప్యాసింజర్ టచ్‌స్క్రీన్ ఉంటాయి. అయితే కొత్త ఎస్యూవీ 700 లో ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు.