
ఇక ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి ఇండియాలో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ పాన్ వరల్డ్ లో గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలం అయితే దక్కుతుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
భారీ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు భారీ సాహసాలను ఎలాంటి డూప్ లేకుండా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడట…మరి ఆ షాట్స్ ని మనం సినిమా థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకుడికి ఒక థ్రిల్ ఫీల్ అయితే కలుగుతుందని మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి మహేష్ బాబు ఇంతకుముందు కూడా ఎలాంటి డూప్ లేకుండా కొన్ని స్టంట్లు అయితే చేశాడు. ఇక ఈ సినిమా ద్వారా మహేష్ బాబుకి మంచి క్రేజ్ దక్కుంటుందనే చెప్పాలి. కానీ ఈ సినిమాలో ఆయన చేసిన స్టంట్స్ కి సైతం చాలా గొప్ప గుర్తింపు వస్తుందంటూ అభిమానులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు…