
Liquor Price Hike: మందు బాబులకు చేదు వార్త.. భారీగా పెరిగిన మద్యం ధరలు.. కొత్త ధరలు ఇవే
Liquor Price Hike: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. మద్యం షాపులకు వెళ్తే డబ్బులు ఎక్కువ తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం మరోసారి మద్యం ధరలును భారీగా పెంచింది. ఇటీవల బీరు ధరలు పెంచి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు లిక్కర్ ధర కూడా పెంచి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మద్యం ధరలు పెరిగిన బోర్డు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే క్వార్టర్ పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్ పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు పెంచింది తెలంగాణ సర్కార్. దీంతో ఒక్కసారిగా మద్యంప్రియులకు దిమ్మతిరిగినట్లయ్యింది. అయితే కొన్నాళ్ళ క్రితం బీరు ధరలు 15శాతం పెంచి యూత్ కు ఈ సమ్మర్ లో ఇంకా వేడిని పెంచింది. ఇప్పుడు లిక్కర్ ధరను కూడా పెంచి సామాన్యుల జేబుపై భారం పడేలా చేసింది. ధరలను పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ ఒక సర్క్కూలర్ కూడా వైన్స్ షాపులకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే తాజా పెంపు నేటి నుంచి వర్తిస్తుందా లేదా అనేది క్లారిటీ మాత్రం లేదు.
గత కొన్నాళ్లుగా మద్యం కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ కారణంగానే ధరలు పెంచుతున్నట్లు అధికారుల నుంచి సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలతో చూస్తే అవి ఆయా కంపెనీలకు లాభాలను ఇవ్వడం లేదని సమాచారం. ఎందుకంటే మద్యం ధరలో సగం వరకు ప్రభుత్వ ట్యాక్సులకే వెళ్తుంది. ఆపై మిగిలిన డబ్బులు మద్యం కంపెనీలకు కావాల్సిన లాభాలను అందించడం లేదని ఆయా కంపెనీల వాదన. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని బహిరంగంగానే వెల్లడించారు. దీంతో ఆ లోటును భర్తీ చేయాలని అనుకున్నా రాష్ట్ర ఖజానానికు ఆర్థిక బలం చేకూరాలనుకున్నా మద్యం ధరలు పెంచడమే ప్రధాన మార్గంగా ఎంచుకున్నట్లు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.