
ఎల్బీ స్టేడియంలో యోగా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎల్బీ స్టేడియంలో యోగా డే కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలు కుష్బూ, మీనాక్షి చౌదరి, సాయిధరమ్ తేజ్, తేజ సజ్జ పాల్గొన్నారు.
యోగా అంతిమ లక్ష్యం మానవత్వం సాధించడం అని పేర్కొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆది యోగి పతంజలి మహర్షి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయం… యోగా అంటే మనస్సు, వృత్తి, ప్రవృత్తులను నిగ్రహించడం, ఇది చాలా ముఖ్యం అని చెప్పారు వెంకయ్యనాయుడు.