
నార్సింగి పోలీసులకు మరోసారి లావణ్య సినీ హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తో పాటు అతని స్నేహితుడు శేఖర్ భాషా తనను చంపాలనుకుంటున్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. రాజ్ తరుణ్ పైనా, మస్తాన్ సాయిపైనా, శేఖర్ భాషాపైన లావణ్య ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. మస్తాన్ సాయిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. రాజ్ తరుణ్ విషయంలో మాత్రం ఇంకా లావణ్య తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. రాజ్ తరుణ్ వల్ల తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని ఆమె అంటున్నారు.
రాజ్ తరుణ్ తల్లిదండ్రులు..
ఇటీవల రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటి వద్దకు వచ్చి తమ కుమారుడి ఇంట్లోకి తమను అనుమతించాలని గట్టిగా పట్టుబట్టారు. బయట కాసేపు నిరసన తెలియజేశారు. తమ కుమారుడు కొనుగోలు చేసిన ఇంట్లో లావణ్య ఉంటుందని, తమకు హక్కు ఉందని వారు ఆరోపించారు. అయితే చివరకు లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి అనుమతిచ్చారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మరోసారి రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిందని, కావాలనే లేని పోని ఆరోపణలు చేస్తుందని రాజ్ తరుణ్ తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు.
మరోసారి ఫిర్యాదు…
నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తో పాటు శేఖర్ భాషాపై ఫిర్యాదు చేసిన లావణ్య తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇటీవల తనపై కొందరు దాడికి దిగారని, తమ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉందని, అయితే తనపై దాడికి కొందరు ప్రయత్నించారంటూ మరోసారి లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదుచ చేశారు.ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకోవడం లేదని ఆరోపించారు. తాను ప్రతి నిమిషం ప్రాణభయంతో బతుకున్నానని, తనకు రక్షణ కల్పించాలని, వారిని అరెస్ట్ చేయాలని లావణ్య కోరుతున్నారు. తమకు ఈ కేసు తప్పించి వేరే పనిలేదన్నట్లుగా వరస ఫిర్యాదులు చూసి నార్సింగి పోలీసులు విసుగుచెందుతున్నారు.